కరోనా వ్యాక్సిన్ 'కొవిషీల్డ్'ను 'భాజపా టీకా'గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. టీకా వేయించుకోవడం వల్ల ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీకాలకు రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు.
దేశంలో టీకా అనేది ఏ రాజకీయ పార్టీకీ చెందినది కాదు. ఇది కేవలం మానవత్వానికి సంబంధించిన అంశం. కరోనా మహమ్మారికి టీకా వస్తుందంటే ఇతరులు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. నా వరకు మాత్రం చాలా ఆనందిస్తా. టీకా వేయించుకొనేందకు ముందు వరుసలో ఉంటా.