తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా టీకాతో నపుంసకత్వం వస్తుందా? - Covid-19 vaccine latest news

కొవిడ్ టీకా తీసుకుంటే నపుంసకులు అయిపోతారా? అసలు జనాభా నియంత్రణకే ఈ టీకాలు తెస్తున్నారా? సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ ఆరోపణలు నిజమేనా? దీనిపై డీసీజీఐ ఏమంటోంది?

Covid-19 vaccines 110 pc safe impotency rumours complete nonsense
వ్యాక్సిన్ తీసుకుంటే నపుంశకత్వం వస్తుందా?

By

Published : Jan 3, 2021, 1:54 PM IST

దేశంలో రెండు కొవిడ్ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి తెలిపిన భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)... ఆ వ్యాక్సిన్ల భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేసింది. టీకాలకు సంబంధించి వ్యాపిస్తున్న వదంతులను కొట్టిపారేసింది.

"కొంచెం అనుమానం ఉన్నా.. టీకాలకు అనుమతి ఇవ్వం. వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితం. అయితే జ్వరం, నొప్పి, అలర్జీలు వంటి స్వల్ప లక్షణాలు కనిపించడం అన్ని టీకాల్లో సాధారణమే. టీకా తీసుకుంటే నపుంసకత్వం వస్తుందన్న వదంతులు పూర్తిగా అవాస్తవాలు."

- వీజీ సోమాని, డీసీజీఐ ప్రతినిధి

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​.. "టీకాలు ప్రజలకు హాని చేస్తాయి. వ్యాక్సిన్​ తీసుకుంటే ప్రజలు నపుంసకులుగా మారే అవకాశముంది. దేశ జనాభాను తగ్గించడానికే ఈ టీకాలకు అనుమతిచ్చారు" అని ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన మరో నేత.. దీనికి వత్తాసు పలికారు.

ఈ క్రమంలోని వదంతులు నమ్మొద్దని, టీకాలు పూర్తిగా సురక్షితమైనవని ఉద్ఘాటించింది డీసీజీఐ.

వ్యాక్సిన్లు ఆమోదం పొందిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే వదంతులను విశ్వసించవద్దని గతంలో ప్రజలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఇదీ చూడండి:'భాజపా వ్యాక్సిన్​ను తీసుకునే ప్రసక్తే లేదు'

ABOUT THE AUTHOR

...view details