తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలి రోజు 3వేల కేంద్రాలు.. 16వేల మంది సిబ్బంది

By

Published : Jan 16, 2021, 10:03 AM IST

Updated : Jan 16, 2021, 8:03 PM IST

Covid-19 Vaccination LIVE
కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియకు సర్వం సిద్ధం

19:11 January 16

తొలిరోజు..

  • లక్షా 91 వేల మందికి కరోనా టీకాలు ఇచ్చాం: కేంద్ర వైద్యశాఖ
  • 3,351 కేంద్రాల ద్వారా వ్యాక్సికేషన్ ప్రక్రియ: కేంద్ర వైద్యశాఖ
  • వ్యాక్సికేషన్ ప్రక్రియలో 16,755 మంది వైద్యసిబ్బంది పాల్గొన్నారు: కేంద్రం

15:14 January 16

చెన్నైలో..

తమిళనాడులో వ్యాక్సినేషన్​ కొనసాగుతోంది. చెన్నైలోని రాజీవ్​ గాంధీ జనరల్​ ఆసుపత్రిలో ఆరోగ్య కార్తకర్తలకు టీకాలను అందించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ సమయంలో అక్కడే ఉండి వారిలో ధైర్యం నింపారు. 

14:49 January 16

ఆసుపత్రిని సందర్శించిన అమరీందర్​ సింగ్​..

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. మొహలీలో టీకా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. 

13:32 January 16

టీకా వేసుకున్న పూనావాలా..

దేశంలో కొవిషీల్డ్​ టీకాను ఉత్పత్తి చేసిన సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా​ వ్యాక్సిన్​ వేయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. కొవిడ్​ వ్యాక్సినేషన్​లో భారత్​ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. 

13:04 January 16

ఏర్పాట్లను సమీక్షించిన యోగి..

ఉత్తర్​ప్రదేశ్​లో కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. లఖ్​నవూలోని బలరాంపుర్​ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమక్షంలో టీకాలను వేశారు. ఈ ఆసుపత్రిలో ఇవాళ 102 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్​ వేయనున్నట్లు ఆయన తెలిపారు.  

12:16 January 16

భాజపా కార్యకర్తల సంబరాలు..

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రారంభంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబయిలోని ఘాట్​గోపర్​ ప్రాంతంలో టీకా పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో భాజపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. కరోనా వైరస్​ను పోలిన దిష్టి బొమ్మను దహనం చేశారు. 

12:11 January 16

భూటాన్​ ప్రధాని అభినందనలు..

  • భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంపై భూటాన్‌ అభినందనలు
  • కొవిడ్‌పై పోరులో గొప్ప ముందడుగు వేసిన భారత్‌కు అభినందనలు: భూటాన్‌ ప్రధాని
  • ప్రధాని మోదీకి, భారత ప్రజలకు అభినందనలు: భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌
  • కరోనా కష్టాలకు వ్యాక్సిన్‌ ప్రక్రియ సరైన ముగింపుగా భావిస్తున్నాం: భూటాన్‌ ప్రధాని

12:06 January 16

సీఎం రూపానీ సమక్షంలో..

గుజరాత్​ అహ్మదాబాద్​లోని ప్రజా వైద్యశాలలో ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్​ పటేల్​ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. 

12:03 January 16

కశ్మీర్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ..

జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లోని షేర్​-ఐ-కశ్మీర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​లో వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. తొలి టీకా డోసును అందుకున్న వలంటీర్​ ఆనందం వ్యక్తం చేశాడు. తొలి డోసు తీసుకొని ఇతరులను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. 

12:01 January 16

భారత్​ బయోటెక్​ టీకా డోసును చూపిస్తున్న హర్షవర్ధన్​..

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభమైంది. భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా డోసును ఎయిమ్స్​లో చూపించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. 

11:49 January 16

టీకా వేయించుకున్న ఎయిమ్స్​ డైరెక్టర్​..

  • దిల్లీ ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్దన్
  • ఎయిమ్స్‌లో టీకా వేయించుకున్న డైరెక్టర్ రణదీప్ గులేరియా
  • ఎయిమ్స్‌లో టీకా వేయించుకున్న నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్

11:19 January 16

2 డోసులు తప్పనిసరి..

కరోనా టీకా రెండు డోసులు తప్పకుండా తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఒక డోసు తీసుకొని.. మరో డోసు తీసుకోకపోవడం లాంటి తప్పులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్న మోదీ.. మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించాలని కోరారు.

11:18 January 16

వారే హక్కుదారులు..

దేశంలో కరోనా కట్టడి కోసం.. ఆరంభం నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర కరోనా వారియర్స్‌.. వ్యాక్సిన్‌కు మొదటి హక్కుదారులని ప్రధాని స్పష్టంచేశారు.

11:15 January 16

శాస్త్రవేత్తల కృషితోనే..

జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.. ఒకేసారి రెండు దేశీయ తయారీ టీకాలు ప్రజలకు అందించిన శాస్త్రవేత్తలు అన్ని విధాల ప్రశంసనీయులని అన్నారు. అహోరాత్రులు శ్రమించి.. టీకాను తయారుచేసిన వారికి దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు చెబున్నానని పేర్కొన్నారు. ఈ టీకాల తయారీతో దేశ శాస్త్రవేత్తలు.. భారత సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారని ఉద్ఘాటించారు. ఈ కారణంగానే భారత వైజ్ఞానిక సమర్థతపై ప్రపంచానికి విశ్వాసం పెరిగిందని అన్నారు. త్వరలోనే మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

11:04 January 16

  • ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం
  • కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ
  • ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన బృహత్తర కార్యక్రమం
  • వర్చువల్‌ ద్వారా వ్యాక్సిన్‌ ప్రక్రియను ప్రారంభించిన ప్రధాని
  • దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ

10:59 January 16

ప్రజల సహకారంతోనే..

  • గతేడాది ఇదేరోజు కరోనాపై సర్వైలైన్స్‌ ప్రారంభించాం: ప్రధాని
  • వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్‌ ప్రారంభించాం: ప్రధాని
  • కరోనా ప్రభావాన్ని ముందే గుర్తించాం: ప్రధాని
  • కరోనాను ఎదుర్కొనేందుకు కమిటీ నియమించాం: ప్రధాని
  • కమిటీ సూచన మేరకు ఎన్నో చర్యలు చేపట్టాం: ప్రధాని
  • జనతా కర్ఫ్యూ విధించి ప్రజలను లాక్‌డౌన్‌కు సిద్ధం చేశాం: ప్రధాని
  • దేశమంతా లాక్‌డౌన్‌ విధించాం: ప్రధాని
  • లాక్‌డౌన్‌లో ప్రజలను ఇంటికే పరిమితం చేయడం కష్టసాధ్యం: ప్రధాని
  • దేశ ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించి సహకరించారు: ప్రధాని
  • లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా కష్టనష్టాలున్నా సమర్థంగా ఎదుర్కొన్నాం: ప్రధాని

10:58 January 16

మోదీ నోట గురజాడ పలుకులు..

  • గురజాడ పలుకులను స్మరించిన ప్రధాని మోదీ
  • సొంత లాభం కొంత మానుకోమని గురజాడ అన్నారు: ప్రధాని
  • దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌ అన్నారు గురజాడ: ప్రధాని

10:46 January 16

అప్పుడలా.. ఇప్పుడిలా..

  • మన దేశంలోకి కరోనా వచ్చినప్పుడు ఒక్క ల్యాబ్‌లోనే పరీక్షించే అవకాశం ఉంది: ప్రధాని
  • ప్రస్తుతం 33 వేలకు పైగా ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి: ప్రధాని
  • వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించారు: ప్రధాని
  • చాలారోజులు కుటుంబాలకు దూరంగా ఉండి పనిచేశారు: ప్రధాని
  • ఒక్కో ప్రాణం నిలిపేందుకు నిర్విరామంగా కృషిచేశారు: ప్రధాని
  • కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అనిర్వచనీయం: ప్రధాని

10:40 January 16

టీకా వేసుకున్నా మాస్కులు తప్పనిసరి..

  • వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరి: ప్రధాని
  • నెల రోజుల వ్యవధిలో రెండో టీకా: ప్రధాని మోదీ
  • టీకా వేసుకున్నా మాస్కులు పక్కనపెట్టొద్దు: ప్రధాని
  • కరోనా పట్ల ఎంత ధైర్యం ప్రదర్శించారో.. ఇప్పుడూ అదే మాదిరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి: ప్రధాని
  • తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌: ప్రధాని
  • ఈ వ్యాక్సిన్‌ కార్యక్రమం భారతదేశ సమర్థతను తెలియజేస్తుంది: ప్రధాని
  • కొవిడ్‌పై యుద్ధంలో వెనుకడుగు వేసేది లేదు: ప్రధాని
  • భారత్‌ వైజ్ఞానిక రంగ సమర్థతపై ప్రపంచమంతా విశ్వాసంతో ఉంది: ప్రధాని

10:33 January 16

  • ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ కార్యక్రమం ప్రారంభం
  • కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ
  • ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూసింది: ప్రధాని
  • వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారు: ప్రధాని
  • శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా రెండు వ్యాక్సిన్లు వచ్చాయి: ప్రధాని
  • మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి: ప్రధాని
  • దేశీయ వ్యాక్సిన్‌ ద్వారా భారత్‌ సత్తా ప్రపంచానికి చాటాం: ప్రధాని
  • వైద్యులు, వైద్యారోగ్యశాఖ కార్యకర్తలే తొలి వ్యాక్సిన్‌కు హక్కుదారులు: ప్రధాని
  • అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేశాం: ప్రధాని

09:53 January 16

కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియకు సర్వం సిద్ధం

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరికాసేట్లో ప్రారంభం కానుంది. ఏడాదికి పైగా వేధిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టునున్నారు. టీకాలు వేయించుకునేందుకు ఆరోగ్య కార్యకర్తలు తరలివస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా టీకా కేంద్రాలను సుందరంగా అలంకరించారు.

3006 కేంద్రాలలో 3 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు నేడు టీకాలు వేయనున్నారు. వర్చువల్ విధానంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు మోదీ. పలువురు టీకా లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

ఇవీ చూడండి:

కొవిడ్​ వచ్చి పోయింది.. మరి టీకా వేయించుకోవాలా?

కొవిషీల్డ్​, కొవాగ్జిన్.. ఏ టీకా పవరెంత?

Last Updated : Jan 16, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details