తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కేసులు- 236 మందికి కరోనా - Covid-19 pandemic in india

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ భారత్​లో నెమ్మదిగా వ్యాపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 63 కేసులు నమోదయ్యయాని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. కరోనా పాజిటివ్​గా తేలిన బాలీవుడ్ గాయని కనికా కపూర్​ కారణంగా పలువురు ఎంపీలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

corona
కరోనా

By

Published : Mar 21, 2020, 5:21 AM IST

Updated : Mar 21, 2020, 11:05 AM IST

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కేసులు- 236 మందికి కరోనా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా మొదలై విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 63 కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 236కు చేరిందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది.

అయితే 223 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 32 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో నలుగురు మరణించగా.. 22 మంది కోలుకున్నట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రాలవారీగా కరోనా కేసులు సంఖ్య ఇలా..

రాష్ట్రం కేసుల సంఖ్య
మహారాష్ట్ర 52
ఉత్తర్​ప్రదేశ్ 23
కేరళ 37
దిల్లీ 17
తెలంగాణ 19
రాజస్థాన్​ 17
హరియాణా 17
కర్ణాటక 15
లద్ధాఖ్ 10
జమ్ముకశ్మీర్ 4
గుజరాత్ 5

ఆంధ్రప్రదేశ్-

తమిళనాడు-

ఉత్తరాఖండ్

9

ఒడిశా

-బంగాల్-

పంజాబ్

6

ఛత్తీస్​గఢ్-

చండీగఢ్

2

మహారాష్ట్రలో...

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 10 వేలకు చేరటం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోనూ కేసులు భారీగా నమోదు కావటం వల్ల బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలను మార్చి 31వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దిల్లీలోనూ కిరాణా, మెడికల్ దుకాణాలు మినహా మాల్స్​పై నిషేధం విధించింది కేజ్రీవాల్ ప్రభుత్వం.

సరిహద్దు మూసివేత..

తమిళనాడు ప్రభుత్వం సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రాష్ట్రంతో సరిహద్దులున్న ఏపీ, కేరళ, కర్ణాటక సరిహద్దు మార్గాలను మార్చి 31 వరకు మూసివేసింది. నిత్యావసర సరుకులు, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.

పార్లమెంటుపై కనికా ఎఫెక్ట్​..

బాలీవుడ్ గాయని కనికా కపూర్​ కారణంగా పార్లమెంటుకు కరోనా సెగ తగిలింది. కరోనా వచ్చినా ఎవరికీ తెలియకుండా దాచటం సహా పలు పార్టీలకు వెళ్లటంపై ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు ఐపీసీ 182, 269, 270 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆర్నెల్ల జైలు లేదా జరిమానా లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉంది.

ఇటీవల కనికా ఇచ్చిన విందుకు పలువురు పార్లమెంటు సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు వెళ్లటం కలకలం సృష్టించింది. రాజస్థాన్​ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె తనయుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

దుష్యంత్​తో పలువురు ఎంపీలు సన్నిహితంగా మెలగటం వల్ల అనుమానాలకు తావిస్తోంది. తృణమూల్ నేత డెరెక్ ఒబ్రెయిన్​, అప్నాదళ్ నేత అనుప్రియ పాటిల్​, మంత్రి మురళీధరన్​, ఎంపీలు సురేశ్ ప్రభు, హుస్సేన్ సింగ్ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు.

సీఎంలతో పీఎం..

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. నిన్న సాయంత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలు సహా.. రాష్ట్రాల్లో సౌకర్యాలు, వైద్యులకు శిక్షణ వంటి అంశాలపై చర్చించారు.

వీసాల పొడిగింపు..

విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో విదేశీయుల వీసాల గడువు ఏప్రిల్‌15 వరకు పొడిగించింది కేంద్రం. విదేశాలకు వెళ్లే విమానాలు రద్దయిన దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:బాలీవుడ్​ గాయనితో పార్లమెంట్​కు కరోనా సెగ

Last Updated : Mar 21, 2020, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details