భారత్‌లోని నగరవాసుల చింత అంతా కరోనా వైరస్ గురించే ఉందని ఓ అంతర్జాతీయ సర్వేలో తేలింది. వీరికి.. నిరుద్యోగం, నేరాలు, పేదరికం, అసమానతలు వంటి సమస్యలు కరోనా తర్వాతేనని సర్వే పేర్కొంది. అయితే వైరస్‌పై పోరులో దేశం సరైన మార్గంలోనే ఉన్నట్టు అధిక మంది అభిప్రాయపడ్డట్లు తెలిపింది.
"నగరాల్లో ఉండే 62శాతం భారతీయులు కరోనాతో ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. 38 శాతం మంది నిరుద్యోగం, 24 శాతం మంది నేరాలు-హింస, 21 శాతం మంది పేదరికం- సామాజిక అసమానతలను పేర్కొన్నారు. అయితే దేశం సరైన మార్గంలోనే అడుగులు వేస్తున్నట్టు 65శాతం మంది అభిప్రాయపడ్డారు."
--- సర్వే.