దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు సోమవారం ఉదయం నాటికి కోటి మార్కును దాటాయి. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.
"సోమవారం ఉదయం 11 గంటల వరకు 1,00,04,101 నమూనాల పరీక్షలు జరిగాయి. ఆదివారం ఒక్క రోజే 1,80,595 పరీక్షలు నిర్వహించారు."
--- లోకేశ్ శర్మ, ఐసీఎంఆర్ సైంటిస్ట్-మీడియా కోఆర్డినేటర్.
దేశవ్యాప్తంగా 1,105 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు శర్మ. వీటిలో 788 ప్రభుత్వానికి చెందినవని.. 317 ప్రైవేటు ల్యాబ్లని వివరించారు. రోజువారీ పరీక్షల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందన్నారు. గడిచిన 14 రోజుల్లో సగటున రోజుకు 2 లక్షల నమూనాలను పరీక్షించినట్టు వెల్లడించారు.