తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 9కోట్లు దాటిన కరోనా పరీక్షలు - Covid-19 active cases in India

దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్ట్​ల సంఖ్య 9కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే సుమారు 11.45 లక్షల నమూనాలను పరీక్షించినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 63లక్షల మందికిపైగా వైరస్​ను జయించారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 87శాతానికిపైగా నమోదైంది.

Covid-19 tests in India cross 9 crores; 20 States and UTs report positivity  rate less than national average
దేశంలో 9కోట్లు దాటిన కరోనా పరీక్షలు

By

Published : Oct 14, 2020, 5:25 PM IST

దేశంలో కరోనా టెస్ట్​ల సంఖ్య 9కోట్ల మార్క్​ను దాటింది. మంగళవారం ఒక్కరోజే 11,45,015 నమూనాలను పరీక్షించినట్టు పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 9కోట్ల 90వేల 122కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 8.26లక్షలకు పైగా యాక్టివ్​ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 11.42శాతం.

రాష్ట్రాల వారీగా నమోదైన కేసులు

దేశవ్యాప్తంగా వైరస్​ పాజిటివ్​ రేటు 8.04గా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పాజిటివ్​ కేసుల రేటు జాతీయ సగటుకంటే తక్కువగా ఉందని పేర్కొంది ఆరోగ్యశాఖ. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని స్పష్టం చేసింది.

కొద్దిరోజులుగా కొత్త కేసుల కంటే, కోలుకున్న వారి సంఖ్యే గణనీయంగా పెరుగుతోందని తెలిపింది.

దేశంలో కరోనా కేసుల వివరాలు

కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు సుమారు 63.01లక్షల మంది వైరస్​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 87.05 శాతానికి పెరిగింది. వైరస్​ నుంచి కోలుకున్నవారిలో దాదాపు 79 శాతం 10 రాష్ట్రాల(మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, పశ్చిమ్​బంగా, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, దిల్లీ)లోనే నమోదవుతున్నాయని పేర్కొంది ఆరోగ్యశాఖ. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు సగటున 15వేల మందికిపైగా రికవరీ అవుతున్నారని స్పష్టం చేసింది.

ప్రతి పది లక్షల మందికి ఆయా దేశాలలో నమోదైన కేసులు
ప్రతి పది లక్షల మందికి ఆయా దేశాల్లో సంభవించిన మరణాలు

ఇదీ చదవండి:బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే విధుల్లోకి కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details