కరోనా సోకిన మృతదేహాల్లో సమయానుగుణంగా వైరస్ మనుగడ కోల్పోతుందని భారత వైద్య పరిశోధన మండలి స్పష్టం చేసింది. అయితే నిర్దిష్ట గడువులోగా మృతదేహంలో ఉన్న వైరస్ నశిస్తుందని స్పష్టంగా చెప్పలేమని పేర్కొంది. అందువల్ల శవపరీక్షలు నిర్వహించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
భారత్‌లో కొవిడ్ మృతదేహాల శవపరీక్షల మార్గదర్శకాలకు సంబంధించి తరచుగా అడిగిన ప్రశ్న(ఎఫ్ఏక్యూ)లకు ఈమేరకు సమాధానాలు ఇచ్చింది ఐసీఎంఆర్. కొవిడ్-19 సాధారణంగా తుంపర్ల ద్వారానే సోకుతుందని స్పష్టం చేసింది.
నెగెటివ్ అయినా సరే!
ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో అధికంగా సంఖ్యలో తప్పుడు నెగెటివ్ ఫలితాలు ఉన్న నేపథ్యంలో... ఆ పరీక్ష ఫలితాల్లో నెగెటివ్‌గా తేలిన మృతదేహాలను కూడా కరోనా సోకిన కేసుగానే పరిగణించాలని వెల్లడించింది ఐసీఎంఆర్. శరీరాన్ని చీల్చి నిర్వహించే శవపరీక్ష పద్ధతులు పాటించకూడదని సూచించింది.
నాసికా కుహరంలోని శ్లేష్మం, ద్రవాలు సహా మృతదేహం నుంచి వెలువడే వాయువుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. అందువల్ల మృతదేహాల శరీరాలపై క్రిమి సంహారకాలను వాడటం ద్వారా వైరస్ నుంచి ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేసింది.
ఒకే గదిలో ఉంచితే?