తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 86,508 మందికి కరోనా - India covid-19 death toll

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 86,508‬ మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,129 మరణాలు నమోదయ్యాయి.

COVID-19 SINGLE DAY SPIKE OF 86,508‬ NEW POSITIVE CASES AND 1,129 DEATHS REPORTED IN INDIA, IN LAST 24 HOURS
కొవిడ్ విధ్వంసం: దేశంలో కొత్తగా 86,508‬ కేసులు

By

Published : Sep 24, 2020, 9:18 AM IST

Updated : Sep 24, 2020, 10:17 AM IST

దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. మరో 86,508 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య 57లక్షల 32వేల 518కి పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 1,129 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 91వేల 149కి చేరింది.

దేశంలో కరోనా కేసుల వివరాలు

దేశవ్యాప్తంగా బుధవారం 11,56,569 నమూనాలు పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లిండించింది. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 6కోట్ల 74లక్షలు దాటింది.

ఐదురోజులుగా దేశంలో కోలుకున్న వారి వివరాలు
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు

పెరిగిన రికవరీలు

దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా రికవరీల సంఖ్య వరుసగా ఐదోరోజూ కొత్త కేసులను దాటిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:'ఆర్​టీ-పీసీఆర్' టెస్టు.. ఐదు రోజుల్లో 3 భిన్న ఫలితాలు

Last Updated : Sep 24, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details