దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తోంది. గురువారం ఒక్కరోజే 83,341 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 39లక్షలు దాటింది. మహమ్మారి సోకడం వల్ల మరో 1,096 మంది చనిపోయారు.
దేశవ్యాప్తంగా గురువారం 11,69,765 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం టెస్టుల సంఖ్య 4 కోట్ల 66 లక్షలు దాటింది.