తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మరో 38,772 మందికి కరోనా

రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. తాజాగా 38,772 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 94 లక్షల 31 వేల 692కు చేరింది. కొవిడ్​ కారణంగా మరో 443 మంది ప్రాణాలు కోల్పోయారు.

COVID-19 SINGLE DAY SPIKE OF 38,772 NEW POSITIVE CASES AND 443 DEATHS REPORTED IN INDIA
దేశవ్యాప్తంగా మరో 38,772 మందికి కరోనా

By

Published : Nov 30, 2020, 9:38 AM IST

Updated : Nov 30, 2020, 9:57 AM IST

దేశంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. కొత్తగా 38 వేల 772 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 94 లక్షల 31 వేల 692కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 443 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1లక్షా 37వేల 139కి పెరిగింది.

నవంబర్​ నెలలో దేశంలో నమోదైన మరణాల వివరాలు

దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 8,76,173 నమూనాలను పరీక్షించారు. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 14కోట్ల 03లక్షలు దాటిందని భారత ఔషధ నియంత్రణ పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) వెల్లడించింది.

కరోనా బారినపడిన వారిలో ఇప్పటివరకు 88లక్షల 47వేల 600 మంది కోలుకున్నారు. 4లక్షల 46వేల 952 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 93.81 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి:కరోనా పుట్టింది భారత్​లోనే: చైనా

Last Updated : Nov 30, 2020, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details