కరోనా బారినపడ్డ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైరస్ బారి నుంచి బయటపడ్డారు. సిద్ధరామయ్య ఆసుపత్రి నుంచి గురువారం ఇంటికి చేరుకోనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించింది.
కరోనా అని తేలడం వల్ల 71 ఏళ్ల సిద్ధరామయ్య ఈనెల 4న బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. ఇవాళ.. సిద్ధరామయ్య పుట్టినరోజు కూడా కావడం విశేషం.