కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులకు వేతనాలు అందేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు క్వారంటైన్ సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది.
వైద్యులకు 14రోజుల క్వారంటైన్ అవసరం లేదని మే 15న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు ఓ ప్రైవేటు వైద్యుడు. జస్టిస్ అశోక్ భూశణ్, జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఎం ఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. వైద్యులకు, ఆరోగ్యకార్యకర్తలకు క్వారంటైన్ నిరాకరించడానికి వీల్లేదని పేర్కొంది.