కరోనాపై పోరు కోసం పీఎం కేర్స్ ద్వారా సేకరించిన నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధి(ఎన్డీఆర్ఎఫ్)కి బదిలీ చేయాలని దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ అవసరం లేదని పేర్కొంది. ఎన్డీఆర్ఎఫ్కు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైనా సహకారం అందించవచ్చని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్డీఆర్ఎఫ్కు సహకరించేందుకు చట్టబద్ధమైన అవరోధాలేమీ లేవని పేర్కొంది. కరోనాపై పోరాటానికి జాతీయ ప్రణాళిక-2019 సరిపోతుందని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.
పీఎం కేర్స్ నిధులు ఎన్డీఆర్ఎఫ్కు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ మేరకు తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.