తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 75 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు - కరోనా రికవరీ రేటు

దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 74.69 శాతానికి చేరింది. మరణాల రేటు కూడా 2శాతంలోపు పడిపోయింది. 1.87 శాతానికి చేరింది. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా 10,23,836 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

COVID-19 recovery rate reaches 74.69 pc, case fatality dips to 1.87 pc: Health ministry
దేశవ్యాప్తంగా 75శాతానికి చేరువలో రికవరీ రేటు

By

Published : Aug 22, 2020, 7:01 PM IST

దేశంలో కరోనా కేసులతో పాటు రికవరీ సంఖ్యలోనూ రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 63,631మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. దీంతో రికవరీ రేటు 74.69 శాతానికి చేరింది. మరోవైపు మరణాల రేటు 1.87కు పడిపోయింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది.

దేశంలో పరీక్ష సామర్థ్యం కూడా రోజురోజుకు భారీగా పెరుగుతోంది. శుక్రవారం నాడు మొత్తం 10,23,836మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 3.4 కోట్లమందిపై పరీక్షలు జరిపారు.

విస్తృతంగా పరీక్షలు నిర్వహించి కేసులును ప్రారంభ దశలోనే గుర్తించడం, సమగ్ర నిఘా, కాంటాక్ట్​ ట్రేసింగ్​, బాధితులకు అందించే క్లినికల్ చికిత్స వల్లే రికవరీ రేటు పెరుగుతోందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.​

ఇదీ చూడండి:-'సైకత గణేశా' కరోనాతో పోరాడే శక్తినియ్యవయ్యా..

ABOUT THE AUTHOR

...view details