దిల్లీ, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా బాధితుల రికవరీ రేటు.. జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ నియంత్రణ, నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందని పేర్కొంది.
ఆదివారం నాటికి దేశంలో 6.73 లక్షల కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో ఇప్పటివరకు 4,09,082 మంది వైరస్ను జయించినట్టు తెలిపింది ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు.. 2,44,814 యాక్టివ్ కేసులున్నట్టు స్పష్టం చేసింది.