తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాక్టివ్​ కేసుల కన్నా 3 రెట్లు అధికంగా రికవరీలు

దేశంలో కరోనా రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 23 లక్షల మంది వైరస్​ను జయించగా.. రికవరీ రేటు 75 శాతానికిపైగా నమోదైంది. మరోవైపు మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.85 శాతానికి చేరడం ఊరటనిస్తోంది.

Recoveries more than 3 times the active cases; case fatality rate drops to 1.85 pc
యాక్టివ్​ కేసుల కన్నా 3 రెట్లు అధికంగా రికవరీలు

By

Published : Aug 24, 2020, 6:20 PM IST

Updated : Aug 24, 2020, 6:26 PM IST

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 23 లక్షల మందికిపైగా బాధితులు వైరస్​ను జయించగా.. రికవరీ రేటు 75.27 శాతంగా నమోదైంది. వ్యాధి వ్యాప్తికంటే రికవరీల రేటు 3 రెట్లు అధికంగా ఉంది. మరోవైపు మరణాల రేటు మరింత ఊరట కలిగిస్తూ.. 1.85 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో 7 లక్షలకు చేరువలో కేసులు

దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 57,469 మంది వైరస్​ను జయించి డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 23,38,035కు పెరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

3.6 కోట్ల పరీక్షలు..

ఇప్పటివరకు సుమారు 3.6 కోట్ల మందికి కొవిడ్​ పరీక్షలు చేపట్టగా.. సగటున ప్రతి పది లక్షల మందికి 26,016ని పరీక్షించారు. ఒక్కరోజు వ్యవధిలో 6,09,917 మందికి టెస్ట్​లు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా ప్రతి మిలియన్​ జనాభాకు టెస్ట్​ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. కొవిడ్​ ల్యాబ్​లను విస్తరించడం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడింది.

ఏ రాష్ట్రాల్లో కేసులు ఎలా..

ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 61,408 కేసులు.. 836 మరణాలు

Last Updated : Aug 24, 2020, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details