తెలంగాణ

telangana

'రాపిడ్​ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహించవద్దు'

By

Published : Apr 25, 2020, 10:00 PM IST

కరోనా పరీక్షల కోసం రాపిడ్ టెస్టు కిట్ల వినియోగాన్ని తక్షణమే నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని ఆదేశించింది కేంద్రం. ఈ పరికరాలు కచ్చితమైన ఫలితాలను ఇవ్వడం లేదని ఇటీవలే పలు రాష్ట్రాలు నివేదించాయి. ఈ క్రమంలోనే కిట్లను ఐసీఎంఆర్​ పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

COVID-19 rapid antibody test kit use put on hold, ICMR to check accuracy: Official source
ఐసీఎంఆర్​ చెప్పే వరకు రాపిడ్​ టెస్టు కిట్లు నిలిపివేత

దేశంలో కొవిడ్-19​ నిర్ధరణకు ఉపయోగిస్తున్న రాపిడ్​ టెస్టు కిట్లను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాల్ని కోరింది ప్రభుత్వం. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) వీటిని పరీక్షించి నిర్ధరించే వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది.

చైనా నుంచి ఉత్పత్తి చేసుకున్న ఈ పరికరాలు.. సరైన ఫలితాలను ఇవ్వడం లేదని పలు రాష్ట్రాలు నివేదించాయి. ఈ క్రమంలోనే ఐసీఎంఆర్​ ఏర్పాటు చేసిన బృందాలు కిట్లను పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వీటి కచ్చితత్వంపై డబ్యూహెచ్​ఓ స్పందించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్​ ఈ పరికరాలను తన సొంత ప్రయోగశాలలో పరీక్షిస్తోందని, త్వరలోనే వీటిపై ఓ స్పష్టత రానున్నట్లు తెలిపారు.

వాటిని భర్తీ చేయమని అడుగుతాం..

రాపిడ్​ టెస్టు కిట్లతో పరీక్షలు నిర్వహించిన కొన్ని రాష్ట్రాల్లో 6 నుంచి 71 శాతం వరకు వచ్చిన ఫలితాల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఐసీఎంఆర్​లోని ఎపిడెమియాలడి అండ్​ కమ్యూనికేషన్​ డిసీజెస్​ నిర్వాహకులు తెలిపారు. ఈ కిట్లు సరిగా పనిచేయడం లేదని నిర్ధరణ అయితే.. వాటిని కొత్త పరికరాలతో భర్తీ చే కంపెనీలను అడగనున్నట్లు పేర్కొన్నారు. భారత్​ ఇటీవలే చైనాలోని రెండు కీలక కంపెనీల నుంచి ఐదు లక్షల రాపిడ్​ టెస్టు కిట్లను కొనుగోలు చేసింది. వాటిని వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలకు, రాష్ట్రాలకు పంపిణీ చేసింది.

15 నిమిషాల్లో ఫలితాలు...

ప్రస్తుతం కరోనా వైరస్​ను గుర్తించేందుకు ప్రభుత్వం పీసీఆర్​ పద్ధతిని ఉపయోగిస్తోంది. ఈ పరీక్ష ద్వారా ఫలితాలు రావడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. రాపిడ్​ టెస్టు కిట్లతో15 నుంచి 30 నిమిషాల్లోనే ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి: కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details