కరోనా వైరస్ పరీక్షలను దేశంలో వేగవంతం చేయాలన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. లాక్డౌన్ ప్రయోజనం చేకూరాలంటే పరీక్షల రేటు పెరగాల్సిందేనని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. పరీక్షల ఫలితాల ద్వారా వైరస్ తీవ్రత, వ్యాధి ప్రభావిత ప్రాంతాలు, కరోనాపై కీలక అంశాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
"కరోనా వైరస్ పరీక్షల రేటును భారత్ తక్షణమే పెంచాల్సిన అవసరం ఉంది. వైరస్ గురించి కీలకమైన సమాచారం కోసం పరీక్షల ఫలితాలు వేగవంతం చేయాలి. లాక్డౌన్ ప్రయోజనాలు చేకూరాలంటే పెద్దఎత్తున వైరస్ నిర్ధరణ పరీక్షలు, వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి