దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం, లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో వివిధ పార్టీలకు చెందిన నేతలతో ఈనెల 8న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు వెల్లడించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.
" పార్లమెంట్ ఉభయసభల్లో ఐదుగురుకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీల నేతలతో ఈనెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. కొవిడ్-19, దేశవ్యాప్త లాక్డౌన్పై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది."