తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖ్యమంత్రులతో నేడు మోదీ వీడియో కాన్ఫరెన్స్​ - coronavirus latest news

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్​ కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీయనున్నారు. పలు కీలక ఆంశాలను ప్రస్తావించనున్నారు.

PM Modi to hold video conf with state CMs
ముఖ్యమంత్రులతో నేడు మోదీ వీడియో కాన్ఫరెన్స్​

By

Published : Apr 2, 2020, 5:06 AM IST

దేశంలో తొమ్మిది రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్ధితిపై ఆరా తీయడం సహా కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనున్నారు. కరోనా నివారణకు సంబంధించి ముఖ్యమంత్రులకు పలు సూచనలు చేయనున్నారు.

వలస కార్మికుల స్థితిగతులు, తబ్లీగీ జమాత్ అంశం కూడా ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు నిత్యావసర వస్తువుల అందుబాటు అంశం కూడా చర్చించే సూచనలు ఉన్నాయి. కరోనా అంశంపై రెండు వారాల వ్యవధిలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండోసారి.

న్యాయమూర్తులకు ధన్యవాదాలు..

కరోనాపై పోరుకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన 'పీఎం కేర్స్​' సహాయ నిధికి రూ.50వేల చొప్పున సాయం ప్రకటించారు సుప్రీంకోర్టులోని 33మంది న్యాయమూర్తులు. వీరందరికీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.

ఇదీ చూడండి: 'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్'

ABOUT THE AUTHOR

...view details