కొవిడ్-19ను అరికట్టేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో ప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరఖ్‌పుర్‌లో అక్టోబర్ నుంచి ఈ ట్రయల్స్ జరగనున్నట్లు తెలిపారు ఉత్తర్‌ప్రదేశ్ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ .
అక్టోబర్‌లో కొవాగ్జిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ - కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్
కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేస్తోన్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో ప్రారంభించనుంది. అక్టోబర్‌లో ఈ క్లినికల్ ట్రయల్స్ మొదలుకానున్నాయి.
కొవాగ్జిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు సర్వం సిద్ధం
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ సంయుక్తంగా కొవాగ్జిన్‌ను తయారు చేస్తున్నాయి.
ఇదీ చూడండి:'రైతు సంక్షేమం కోసమే సంస్కరణలు'