తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇళ్లపై పోస్టర్లతో అంటరానివారిగా కొవిడ్ రోగులు' - కొవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించడంపై సుప్రీం విచారణ

కొవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించే విధానం ఇతరులను అప్రమత్తం చేసేందుకు మాత్రమేనని సుప్రీం కోర్టుకు వివరించింది కేంద్రం. ఈ నిబంధనలను కేంద్రం జారీ చేయలేదని స్పష్టంచేసింది. కరోనా రోగుల ఇంటి ముందు పోస్టర్లు అంటించడం వల్ల సమాజంలో వారిని అంటరాని వారిగా చూస్తున్నారన్న సుప్రీం వ్యాఖ్యలపై ఈ మేరకు వివరణ ఇచ్చింది.

Controversy over posters outside the homes of corona patients
కొవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్ల వివాదం

By

Published : Dec 1, 2020, 4:16 PM IST

కొవిడ్ రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించడం వల్ల సమాజంలో వారిని అంటరాని వారిగా చూస్తున్నారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. క్షేత్ర స్థాయిలో దాని పరిణామాలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.

సుప్రీంకోర్టు ప్రశ్నలకు.. కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్​ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని సొంతంగా.. ఇతరులకు కరోనా వ్యాపించకుండా ఉండేందుకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టర్లు అందించాలని ఆదేశాలు కేంద్రం జారీచేయలేదని స్పష్టం చేశారు. ఇతరులను అప్రమత్తం చేయడం మాత్రమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని.. ఎవరినీ కించపరిచే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.

విచారణ మధ్యలో చొక్కాలేని వ్యక్తి..

కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న విచారణలో మంగళవారం ఓ వ్యక్తి చొక్కా లేకుండా కనిపించాడు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. 7 నెలల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుగుతున్నప్పటికీ పదే పదే ఇలాంటివి జరగటం సరైంది కాదని పేర్కొంది.

ఇదీ చూడండి:కొవిషీల్డ్​ పనితీరుపై సీరం స్పష్టత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details