తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాను జయించినా.. 8 రోజుల వరకు వైరస్​ వదలదు!'​ - కరోనావైరస్ జాగ్రత్తలు

ఒక్కసారి కరోనా బారినపడి కోలుకున్నవారి శరీరంలో ఎనిమిది రోజుల వరకు వైరస్​ సజీవంగానే ఉండే అవకాశముందంటున్నారు శాస్త్రవేత్తలు. వైరస్​ లక్షణాలు కనిపించకపోయినా నిర్బంధ కాలాన్ని మరో రెండు వారాలు పొడిగించుకోవాలని సూచిస్తున్నారు.

COVID-19 patients may still have coronavirus after symptoms disappear says an american study
'కరోనాను జయించినా.. 8 రోజుల వరకు వైరస్​ వదలదు!'​

By

Published : Mar 28, 2020, 8:45 PM IST

కరోనా వైరస్​ సోకితే దానిని జయించడం అంత సులభమేమీ కాదు. కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో, నిర్బంధంలో ఉన్న తర్వాత కరోనా లక్షణాలు కనిపించకపోతే, వైరస్​ శరీరంలో నుంచి పోయినట్టు కాదని చెబుతోంది ఓ అధ్యయనం. కరోనా రోగులు డిస్చార్జ్​ అయ్యాక దాదాపు 8 రోజుల పాటు వైరస్​ సజీవంగానే ఉంటుందని తేల్చి చెబుతున్నారు.

సగం మందిలో సజీవంగా​...

కరోనాను జయించిన 16 మందిపై పరీక్షలు నిర్వహించారు అమెరికా శాస్త్రవేత్తలు. అందులో ఎవరికీ కరోనా లక్షణాలు కనబడలేదు. కానీ, వారి గొంతు నుంచి తీసుకున్న నమూనాలను రోజు విడిచి రోజు క్షుణ్నంగా పరిశీలించగా.. వారిలో సగం మందిలో వైరస్​ సజీవంగానే ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనంలో ఏల్ వర్సిటీ తరఫున భారత శాస్త్రవేత్త లోకేశ్​ శర్మ పాల్గొన్నారు.

మరో రెండు వారాలు..

నిర్బంధ వార్డుల్లోని కరోనా బాధితులకు.. రెండు సార్లు వైద్యపరీక్షలు నిర్వహించి వైరస్​ లేదని నిర్ధరించిన తర్వాతే వారిని ఇళ్లకు పంపుతారు. అయితే, నిర్బంధ కాలాన్ని మరో రెండు వారాల కొనసాగించకపోతే వైరస్​ వ్యాప్తి మళ్లీ చెలరేగే ఆవకాశముందని హెచ్చరిస్తున్నారు శర్మ.

"మా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... సగం మంది రోగుల్లో కరోనా లక్షణాలు కనిపించకుండాపోయినా వైరస్​ దాదాపు 8 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి వైరస్​ సోకిన వ్యక్తులు వారి నిర్బంధ కాలాన్ని మరో రెండు వారాల పాటు పొడిగించుకుంటే మంచిది. లేకపోతే వారి ద్వారా మరికొందరికి వైరస్​ సోకే ప్రమాదం ఉంది. మేము పరీక్షించిన 16 మందిలో ఇద్దరికి మధుమేహం, ఒకరికి క్షయ వ్యాధి ఉంది. అయితే, కొవిడ్​-19 సంక్రమణపై ఈ వ్యాధులు ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిసింది."

-లోకేశ్​ శర్మ, శాస్త్రవేత్త

అయితే, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ అధ్యయనం వర్తించదని తెలిపారు వైద్యులు.

ఇదీ చదవండి: పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details