తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చికిత్స చేస్తున్న వైద్యుడిపై ఉమ్మిన కరోనా ఉన్మాది - trichy latest news

తమిళనాడులో ఓ కరోనా ఉన్మాది దుశ్చర్యకు పాల్పడ్డాడు. చికిత్స అందిస్తున్న వైద్యుడితో దురుసుగా ప్రవర్తించి మొహంపై ఉమ్మాడు. ఆ రోగిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

Covid - 19 Patient Spits in Doctors Face
వైద్యుడిపై దాడి

By

Published : Apr 12, 2020, 7:47 PM IST

ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై కొందరు ఉన్మాదులు అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. తమిళనాడు తిరుచురాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదే తరహా ఘటన జరిగింది. చికిత్స అందిస్తున్న వైద్యుడితో దురుసుగా ప్రవర్తించాడు ఓ కరోనా సోకిన వ్యక్తి. తను ధరించిన మాస్క్​ను తొలగించి డాక్టర్​పైకి విసిరాడు. ఆ తర్వాత మొహంపై ఉమ్మాడు. ఈ చర్యతో ఆస్పత్రిలోని సిబ్బంది సహా అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఉన్మాదిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

కావాలనే...

కరోనా సోకిన వ్యక్తి తిరుచురాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చేరాడు. అప్పటి నుంచి వైద్య సిబ్బందికి సహకరించడం లేదని అధికారులు తెలిపారు.

మరో వైద్యుడికి కరోనా

తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో 65ఏళ్ల వైద్యుడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆయన కాదంబడిలో ఓ ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నట్లు చెప్పారు. ఆ డాక్టర్ వద్ద చికిత్స పొందిన రోగులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: కరోనా కలవరం: 'మహా'లో 134, రాజస్థాన్​లో 96 కొత్త కేసులు

ABOUT THE AUTHOR

...view details