తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేరు ఒకటే కదా అని.. కరోనా రోగి డిశ్చార్జ్​! - corona \patient came out of hospital without recovering in assam

ఓ ఊరు, ఓ వీధి, ఓ బడి అంతెందుకు ఓ ఇంట్లోనే ఒకేలా వినిపించే పేరున్నవారుంటే పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, ఆసుపత్రిలో మాత్రం ఒకే పేరున్న రోగులుంటే.. పెద్ద చిక్కే ఎదురవుతుందని అసోంలో జరిగిన ఓ ఘటనతో స్పష్టం అవుతోంది. అవును, ఒకేలా ఉండే పేర్ల వల్ల కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి​కి బదులు, కోలుకోని రోగి డిశ్చార్జ్​ అయ్యాడు.

COVID-19 patient discharged from Assam hospital due to confusion over names
పేరు ఒకటే కదా అని.. కరోనా పేషంట్​ను డిశ్చార్జ్​ చేసేశారు!

By

Published : Jun 13, 2020, 6:25 PM IST

అసోం దరంగ్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు ఇప్పుడు ఆ ప్రాంతంలో భయం పుట్టిస్తోంది. రెండు రోజుల క్రితం మంగల్​దోయ్​ ప్రభుత్వాసుపత్రిలో కరోనా బారి నుంచి కోలుకున్న 14 మంది పేర్లను చదివారు వైద్యులు. ఆ జాబితాలో చదివిన పేరు తన పేరులాగే వినిపించి కొవిడ్​ నుంచి కోలుకున్నాడని నిర్ధరించకముందే ఓ వ్యక్తి స్పందించాడు. కరోనా నయం అయ్యిందనుకుని ఇంటికి వెళ్లిపోయాడు.

అయితే ఆ పేరు తనది కాదని, దల్​గావ్​కు చెందిన మరో వ్యక్తి పేరని వైద్యులకు తర్వాత తెలిసింది. దీంతో హుటాహుటిన అంబులెన్స్​ పంపి... ఆ వ్యక్తిని తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మళ్లీ పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తికీ కరోనా నయమైపోయిందని తేలింది.

ఒకే రకమైన పేర్లు ఉండి, మాస్కుల కారణంగా ముఖాలు కనిపించకే ఈ పొరపాటు జరిగిందన్నారు వైద్యులు. దరంగ్​ డిప్యూటీ కమిషనర్​ దిలీప్​ కుమార్ వోరా ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పొరపాటుగా డిశ్చార్జ్​ అయిన వ్యక్తి ఇంటిని కంటెయిన్​మెంట్ జోన్​గా ప్రకటించారు.

అసోంలో ఇప్పటికే 3,600 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 8 మంది మృతి చెందగా, మరో 2000 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:కరోనా చికిత్సపై హైకోర్టు కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details