తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు - కరోనా మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 69,239 కేసులు నమోదు కాగా.. మరో 912 మంది కొవిడ్​కు బలయ్యారు.

COVID-19 news from across the nation
దేశవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Aug 23, 2020, 9:33 AM IST

Updated : Aug 23, 2020, 11:40 AM IST

దేశంలో కరోనా విజృభణ ఆగడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 912 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులు 30 లక్షల మార్క్​ను దాటాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 74.90 శాతం ఉండగా.. మరణాల రేటు 1.86 శాతానికి తగ్గింది. అలాగే యాక్టివ్​ కేసుల రేటు 23.24 శాతంగా ఉంది.

కరోనా వివరాలు

తాజాగా మహారాష్ట్రలో 14,492 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,61,942కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 297 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 21,995కు పెరిగింది.

  • తమిళనాడులో 5వేల 980మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 3లక్షల 73వేల 410కి చేరాయి.
  • దిల్లీలో కొత్తగా 1,412 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో లక్షా 60వేల 16మంది కరోనా బారినపడ్డారు.
  • కేరళలో శనివారం 2 వేల 172 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 56,354కు పెరిగింది.
    రాష్ట్రాల వారీగా
  • ఆగస్టు 22 వరకు దేశవ్యాప్తంగా 3, కోట్ల 52 లక్షల 92 వేల 220 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 8,01,147 టెస్టులు చేసినట్లు పేర్కొంది.
Last Updated : Aug 23, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details