తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో ఒక్కరోజే 8,852 కేసులు.. 106 మరణాలు

భారత్​లో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే 35 లక్షల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. 63 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీల్లో భారీగా కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారు.

covid-19 new cases and death toll in the Nation
బిహార్​లో కొత్త కేసుల కంటే రికవరీలే అధికం

By

Published : Aug 30, 2020, 8:27 PM IST

Updated : Aug 30, 2020, 9:08 PM IST

దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వైరస్​ ఉగ్రరూపం దాల్చుతోంది. విపరీతంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 16,408కేసులు బయటపడ్డాయి. మరో 296 మంది వైరస్​​కు బలయ్యారు. ఇప్పటివరకు 5 లక్షల 62 వేల మందికిపైగా రికవరీ అయ్యారు.

ఉగ్రరూపం..

కర్ణాటకలో కొత్తగా 8,852 మందికి వైరస్​ సోకింది. 106 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 34 వేలకు చేరువలో ఉంది. 2 లక్షల 42 వేల మందికి పైగా కొవిడ్ ​నుంచి కోలుకున్నారు.

6 వేలకు పైగా..

ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 6,233 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 25 వేలు దాటింది.

కరోనా విలయం..

తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 6,495 కేసులు నమోదవగా... మరో 94 మంది మహమ్మారితో చనిపోయారు. 3,62,133 మంది వైరస్​ నుంచి బయటపడ్డారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో కొత్తగా 2,154 మంది వైరస్​ బారిన పడ్డారు. ఏడుగురు మరణించారు.
  • బిహార్​లో ఒక్కరోజే 2,078 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. అయితే కొత్త కేసుల కంటే రికవరీ అధికంగా ఉండటం విశేషం. ఇవాళ ఒక్కరోజు 2,231మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
  • దిల్లీలో తాజాగా 2,024 కేసులు వెలుగుచూశాయి. మరో 22 మంది మృతి చెందారు.
  • పంజాబ్​లో కొత్తగా 1,689 కేసులు నమోదుకాగా.. 56 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • రాజస్థాన్​ రవాణా శాఖ మంత్రి ప్రతాప్​ సింగ్​ కచారియా కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ఇదీ చూడండి:ఒడిశాలో వరద బీభత్సం- 17 మంది మృతి

Last Updated : Aug 30, 2020, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details