శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది. పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు.
నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే శబరిమలలోకి ప్రవేశం
ఈ సారి శబరిమల అయ్యప్ప సందర్శనకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో.. దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు.
నెగెటివ్ ఉంటేనే శబరిమలలోకి ప్రవేశం
రెండు నెలల దర్శనాల నిమిత్తం ఆలయం నవంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం, లాక్డౌన్ల కారణంగా దాదాపు 5 నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు.