కొవిడ్-19ను అంతంచేసే మందు రెండు వారాల్లోనే మార్కెట్లోకి రానుందని పేర్కొన్నారు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్. కరోనా మహమ్మారిపై పోరాటంలో తమ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలు రోజూ తప్పనిసరిగా యోగా చేయాలని సూచించారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని పిలుపునిస్తూ.. ఈటీవీ భారత్ ముఖాముఖిలో కీలక విషయాలు వెల్లడించారు రాందేవ్. అలాగే.. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక పన్నులు విధించాలని సూచించారు.
'రెండు వారాల్లోనే మార్కెట్లోకి కరోనా మందు' - Baba Ramdev on yoga day
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ మెడిసిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్. రెండు వారాల్లో కొవిడ్-19కు మందును.. పతాంజలి మార్కెట్లోకి తీసుకొస్తుందని తెలిపారు. కరోనా వైరస్ సహా అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి పలు విషయాలపై ఈటీవీ భారత్‌తో మాట్లాడారు బాబా.
ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోందని.. దేశంలో ఇప్పటికే 12వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు బాబా. ఈ క్రమంలో కొవిడ్-19కు మందు తయారు చేసే పనిలో పతాంజలిలోని పరిశోధన, అభివృద్ధి విభాగం పురోగతి సాధించినట్లు తెలిపారు. రెండు వారాల్లో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. 'కరోనా రికవరీ రేటు అధికంగా ఉంది.. వైరస్ చికిత్సకు అలోపతి మందులతో పాటు ఆయుర్వేద మందులను సూచించాలని' ఐసీఎంఆర్‌ను కోరారు బాబా. కరోనా ఔషధం తయారీలో అన్ని రకాల నిబంధనలను పాటించామని, 100 శాతం రికవరీ రేటు ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: 'భారతదేశ సౌర్వభౌమత్వాన్ని చైనా గౌరవించాల్సిందే'