దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మరో 4వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు.
మహారాష్ట్రలో ఇవాళ 6,875 కేసులు, 219 మరణాలు
By
Published : Jul 9, 2020, 8:28 PM IST
|
Updated : Jul 9, 2020, 10:43 PM IST
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ 6,875 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,067 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,30,599కి, మరణాలు 9,667కు చేరాయి. ఇప్పటివరకు మొత్తం 1,27,259 మంది కోలుకున్నారు. 93,652 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడులో..
తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రికార్డు స్థాయిలో 4,231 కొత్త కేసులు నిర్ధరణయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,26,581కి చేరగా.. మరణాలు 1,765కు పెరిగాయి.
కర్ణాటకలో..
కర్ణాటకలో ఇవాళ 2,228 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 31,105కి, మరణాల సంఖ్య 486కి చేరింది.
కేరళలో మళ్లీ విజృంభణ
కేరళలో కొద్ది రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవాళ 339 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,534కు చేరింది.
దిల్లీలో..
దిల్లీలో ఇవాళ 2187 మందికి వైరస్ సోకింది. కేసుల సంఖ్య 1,07,051కి చేరింది. మొత్తం 3,258 మంది మరణించారు.