కరోనా విజృంభణ నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వ్యక్తిగత సిబ్బందికి పార్లమెంట్ ప్రవేశాన్ని నిషేధించింది. సభా సమావేశాల సందర్భంలో ఎంపీలకు చెందిన 800మందికిపైగా పీఏలు ఉంటే కరోనా విజృంభించే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని లోక్సభ ప్రధాన కార్యదర్శి స్నేహలత శ్రీవాత్సవ పేర్కొన్నారు.
"భౌతిక దూరం నిబంధనను దృష్టిలో పెట్టుకుని, ఎంపీలకు చెందిన పీఏలను పార్లమెంట్లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేశాం. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది."