కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు పాఠశాలలను పునఃప్రారంభించవద్దని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు అభ్యర్థించారు. ఈ మేరకు 2.13 లక్షల మంది అభ్యర్థనపత్రంపై సంతకం చేశారు.
"జులైలో పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఇలా చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ఈ-లెర్నింగ్ పద్ధతిలోనే కొనసాగించండి. వర్చువల్ విధానంలో పాఠశాలలు వాటి బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతున్నప్పుడు ఇలానే ఎందుకు కొనసాగించకూడదు? " - తల్లిదండ్రుల అభ్యర్థన
పరిస్థితులను సమీక్షించి జులై నెలలో అన్ని విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించనున్నట్లు శనివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటనపై పలువులు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.