తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24 గంటల్లో 909 కొత్త కేసులు- 34 మరణాలు - coronavirus death toll india

కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదయ్యాయి. 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 8,356 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 273 మంది చనిపోయారు.

coronavirus in India
దేశంలో కరోనా విజృంభణ

By

Published : Apr 12, 2020, 9:47 AM IST

దేశంలో కరోనా విజృంభణ అంతకంతకూ తీవ్రమవుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే కొత్తగా 909 పాజిటివ్​ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది.

వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలోనే ఇప్పటివరకు 127 మంది మృత్యువాత పడ్డారు.

ఛత్తీస్​గఢ్​లో మరో 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరికి తబ్లీగీ జమాత్​తో సంబంధమున్న వారి నుంచి వైరస్ సోకినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25కు పెరిగింది.

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో కొత్తగా 49 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 298కి చేరగా, ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కల్పోయారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 532 కేసులు నమోదు కాగా, మొత్తం 36మంది మృతి చెందారు.

రాజస్థాన్​లో కొత్తగా 51 కేసులు నమోదు కాగా, మరో 9 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 751 చేరింది. మృతుల సంఖ్య 51కి పెరిగింది. రాష్ట్ర రాజధాని జైపుర్​లోనే 315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: మాస్కు ధరిస్తే నీకూ నాకూ రక్ష-అదెలాగో చూడండి

ABOUT THE AUTHOR

...view details