దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మార్చి 22 నుంచి ఇదే అత్యల్ప రేటు అని.. ఇది క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు తెలిపింది.
'ప్రపంచంలోనే భారత్ అతి తక్కువ మరణాల రేటు ఉన్న దేశం. ఒక్క రోజులో 500 కన్నా తక్కువ (480) మరణాలు నమోదయ్యాయి.' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో కొవిడ్‌తో 1,19,014 మంది మృతి చెందారని వివరిచింది.