తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హజ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం - భారతీయ ముస్లింల హజ్​ యాత్ర

ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర ఈ ఏడాది భారత్‌ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హజ్ యాత్ర కోసం దరఖాస్తు రుసుము మొత్తం వాపస్‌ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా ప్రభుత్వ సూచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ వెల్లడించారు.

COVID-19: Indian pilgrims will not travel to Saudi Arabia for Haj 2020, says Naqvi
కరోనా కారణం ఈ ఏడాది హజ్‌ యాత్ర ఉండదు: నఖ్వీ

By

Published : Jun 23, 2020, 3:15 PM IST

ప్రపంచదేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్‌ యాత్ర ఈ ఏడాది భారత్‌ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ప్రకటించారు. కరోనా ప్రభావం కారణంగానే సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తర్వాత ఏడాదికీ వినియోగించుకోవచ్చు

హజ్ యాత్ర కోసం దరఖాస్తు రుసుము మొత్తం వాపస్‌ ఇస్తున్నట్లు తెలిపారు నఖ్వీ. డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం 2300 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది అనుమతి లభించిన వారు అంతా 2021లో దానిని వినియోగించుకోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి వల్ల రద్దు..

కరోనా కారణంగా ఈ ఏడాది భారత్‌ నుంచి హజ్‌ యాత్రకు ఎవరూ వెళ్లకపోవచ్చన్న మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏర్పాట్లు చేయడానికి సమయం దగ్గరపడినప్పటికీ, యాత్రికులకు అనుమతిచ్చే విషయమై సౌదీ అరేబియా నుంచి వచ్చే సమాచారం కోసం ఇప్పటివరకు వేచి చూశారు. తాజాగా ఆ ప్రభుత్వమే వద్దని చెప్పడం వల్ల యాత్రపై స్పష్టత వచ్చింది. భారత్‌-సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ఏడాది 2 లక్షల మందికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే, సౌదీలోనూ కరోనా వ్యాపించడం వల్ల యాత్ర రద్దు చేశారు.

ఏంటీ హజ్​ యాత్ర?

ఇస్లాం విధుల్లో హజ్‌ యాత్ర ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కాలోని కాబాను సందర్శించడమే హజ్‌ యాత్ర. జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలన్నది ముస్లింల ఆశయం. ఇస్లామిక్‌ కాలమానం ప్రకారం 12వ మాసం.. 'జిల్‌ హజ్‌' నెలలో పవిత్ర యాత్ర ఉంటుంది. ఆగస్టులో జిల్‌ హజ్‌ నెల వస్తుంది.

ఇదీ చూడండి:ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్​... ఎందుకిలా?

ABOUT THE AUTHOR

...view details