కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు కేంద్రం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, వాయుసేన, నౌకాదళ సేవలు వినియోగించుకోనున్న కేంద్రం.. ఆయా దేశాల్లో ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రత్యేక పోర్టల్ ద్వారా..
ఈ మేరకు భారత రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసిన విదేశాంగ శాఖ.. ఆయా దేశాల్లో ఉన్నవారి వివరాలను సేకరించాలని పేర్కొంది. ఏ దేశంలో ఎంతమంది ఉన్నారో, వారు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో తేల్చాలని సూచించింది. తద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశముంటుందని భావించింది. ఇందుకోసం ఆయా దేశాలలోని భారతీయ రాయబార కార్యాలయాల ద్వారా ఓ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటుచేసింది కేంద్రం. దీని ద్వారా భారత్‌కు రావాలనుకున్న వారి వివరాలు సేకరించి.. తగిన ప్రణాళికలను సిద్ధం చేయచేయనుంది. దేశానికి రావాలనుకున్నవారు పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని.. వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.