భారత్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వేగంగా పెరుగుతున్న కేసుల సంఖ్య రోజుకో రికార్డుగా నిలుస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, ఒక్కరోజులోనే 271 మంది కొవిడ్ కోరలకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7200కు చేరింది. రికార్డు స్థాయిలో 9983 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
దేశంలో కరోనా ధాటికి 7200 మంది బలి - corona updates in telugu
కరోనా మహమ్మారి దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే మరణాల సంఖ్య 7 వేలు దాటింది. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో దాదాపు పదివేల కొత్త కేసులు నమోదయ్యాయి. 271 మంది ప్రాణాలు కోల్పోయారు.
![దేశంలో కరోనా ధాటికి 7200 మంది బలి COVID-19 India Tracker: State-wise report](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7526310-911-7526310-1591604706715.jpg)
దేశంలో కరోనా ధాటికి 7200 మంది బలి
మహారాష్ట్రలో అత్యధికంగా 3060 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 85 వేలు దాటింది. గుజరాత్లో 1249 మంది, మధ్యప్రదేశ్లో 412, బంగాల్లో 396 మంది కరోనా బారిన పడి మృతిచెందారు.
ఇదీ చదవండి:సీఎంకు గొంతునొప్పి- మంగళవారం కరోనా టెస్ట్
Last Updated : Jun 8, 2020, 3:31 PM IST