తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐరోపా, పశ్చిమాసియా' నుంచే భారత్​కు మహమ్మారి - corona situtation in india

కరోనా భారత్​కు ఎలా వచ్చిందనే అంశమై కీలక అంశాన్ని వెల్లడించింది బెంగళూరులోని ఐఐఎస్​సీ. ఐరోపా, పశ్చిమాసియా నుంచే భారత్​కు మహమ్మారి వచ్చి ఉంటుందని తేల్చింది. భారతీయ వైరల్ జన్యువులను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించింది.

corona
ఐరోపా, పశ్చిమాసియా నుంచే భారత్​కు మహమ్మారి

By

Published : Jun 10, 2020, 10:50 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్​కు ఎలా వచ్చి ఉంటుందన్న అంశమై కీలక విషయాన్ని బయటపెట్టింది ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్(ఐఐఎస్​సీ). ఐరోపా, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆసియా నుంచే వైరస్ దేశంలోకి ప్రవేశించి ఉంటుందని తేల్చింది. ఈ అంశమై పరిశీలన చేసిన అనంతరం ఈ విషయాన్ని చెప్పింది. ఈ విశ్లేషణ కోసం 294 భారతీయ వైరల్ జన్యువులను పరిశీలించింది.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, భారత్​లోని వైరస్ జన్యువుల్లో ఉన్న మార్పులను గుర్తించే లక్ష్యంతో పరిశోధన చేసింది ఐఐఎస్​సీ బృందం.

"ప్రధానంగా ఐరోపా, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, దక్షిణాసియా ప్రాంతాల నుంచే వైరస్ దేశంలోకి ప్రవేశించిందని భావిస్తున్నాం. ప్రపంచ దేశాలను బాధిస్తున్న వైరస్​తో పోలిస్తే భారత్​లోని మహమ్మారిలో 40 శాతం జన్యు భిన్నత్వం కనిపించింది."

-ఐఐఎస్​సీ ప్రకటన

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్​లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని పేర్కొంది ఐఐఎస్​సీ. కేసులను అరికట్టేందుకు లాక్​డౌన్, భౌతిక దూరం పాటించడం, బాధితులను వేగంగా గుర్తించడం వంటి చర్యలు ఉపకరించినట్లు చెప్పింది.

ఇలా వైరస్ జన్యువుల్లో భిన్నత్వాన్ని గుర్తించడం ద్వారా వైరస్ తీవ్రత, కారకాలు వంటివి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. వైరస్ ఉత్పత్తి, దేశాల మధ్య సంక్రమణ గుర్తించడానికి వీలవుతుంది.

ఇదీ చూడండి:'చైనాతో సరిహద్దు అంశంపై మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణ'

ABOUT THE AUTHOR

...view details