కొవిడ్-19 సంక్షోభంతో మధ్యలోనే చదువు మానేసిన పిల్లలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటింటి సర్వే నిర్వహించి డ్రాప్ అవుట్లను గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. డ్రాప్ అవుట్లను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాలని సిఫార్సు చేసింది. అంతేకాక మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులను పాఠశాల నుంచి తీసివేసే విధానాన్ని రద్దు చేయాలని పేర్కొంది. చదువు మానేసిన విద్యార్థులను గుర్తించడం, పాఠశాలలో చేర్పించటం, విద్యను కొనసాగించటం అనే మూడు లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించింది.
" అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటి సర్వే నిర్వహించి అర్ధంతరంగా చదువు మానేసిన 6-18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలను గుర్తించాలి. వారి పేర్లను నమోదు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలి. కరోనా ప్రభావం పిల్లలపై పడకుండా చూడాలి."