తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. వైరస్​కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​). క్షయ వ్యాధిని అరికట్టే బీసీజీ టీకా వయోధికులకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందా అనే అంశంపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేయనుంది. దాదాపు 1500 మంది 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగించి పరిశీలించనున్నారు.

ICMR to conduct study on effectiveness of BCG vaccine among elders
బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

By

Published : Jul 19, 2020, 8:44 AM IST

క్షయ వ్యాధిని అరికట్టేందుకు నవజాత శిశువులకిచ్చే బీసీజీ టీకా... 60 ఏళ్లు పైబడిన వయోధికులకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందా లేదా అనే అంశాన్ని నిర్ధరించుకునేందుకు భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) విస్తృత అధ్యయనాన్ని నిర్వహించనుంది. దీనికి గాను తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీలను ఐసీఎంఆర్‌ కార్యక్షేత్రాలుగా ఎంపిక చేసింది.

1500 మందిపై..

కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆరోగ్యంగా ఉన్న 60 ఏళ్లకు పైబడిన 1500 మంది వ్యక్తులను ఎంపిక చేసుకొని ఈ టీకా ఇస్తారు. బీసీజీ టీకా పెద్దవారిని కరోనా నుంచి రక్షించగలుతుందా, ఒక వేళ వైరస్‌ సోకినా తీవ్రత తగ్గించేందుకు దోహదపడుతుందా, మరణ ప్రమాదాన్ని నివారిస్తుందా అన్న అంశాలపై అధ్యయనం చేయనున్నట్లు ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా ఇచ్చిన వలంటీర్లను ఆరు నెలల పాటు పరిశీలనలో ఉంచుతారు.

మన దేశంలో గత 50 ఏళ్లుగా చిన్నారులకు బీసీజీ టీకా ఇస్తున్నారు.

అధ్యయనానికి నేతృత్వం..

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌-చెన్నై, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌-అహ్మదాబాద్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌-భోపాల్‌, జీఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ కేఈఎం హాస్పిటల్‌-ముంబయి, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంప్లిమెంటేషన్‌ రీసెర్చ్‌ ఆన్‌ నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌-జోధ్‌పుర్‌, ఎయిమ్స్‌-దిల్లీ సంస్థలు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించనున్నాయి.

ఇదీ చూడండి: కరోనా మహాఉద్ధృతి- కోటీ 45 లక్షలకు చేరువలో కేసులు!

ABOUT THE AUTHOR

...view details