తెలంగాణ

telangana

By

Published : May 4, 2020, 6:36 PM IST

Updated : May 4, 2020, 6:53 PM IST

ETV Bharat / bharat

ఐబీఎం కృత్రిమ మేధ సాంకేతికతతో కరోనా వివరాలు

కరోనాపై పోరులో భాగంగా కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తాజాగా అందుబాటులో ఉంచేందుకు ఐబీఎం రూపొందించిన కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించనుంది ఐసీఎంఆర్​. ఈ వర్చువల్ చాట్​బోట్​ ద్వారా కరోనాకు సంబంధించిన వివరాలు వేగవంతంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

ICMR deploys IBM's Watson
ఐబీఎం కృత్రిమ మేధ సాంకేతికతో కరోనా కేసుల వివరాలు

కరోనా పరీక్షలకు సంబంధించిన వివరాలను సరళీకృతం చేసి కచ్చితమైన, తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ఐబీఎం కృత్రిమ మేధ సాంకేతికత వాట్సన్​​ అసిస్టెంట్​ను వినయోగించనున్నట్లు తెలిపింది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​). ఈ వర్చువల్ చాట్​బోట్ ద్వారా ఐసీఎంఆర్​ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా కరోనా కేసులకు సంబంధించిన పరీక్షలు, నమూనాల సేకరణ, విశ్లేషణలు, వివరాల నమోదు వేగవంతమవుతాయని వెల్లడించింది. మారిన నిబంధనలకు అనుగుణంగా ఈ చాట్​బోట్​ వివరాలకు మార్పులు చేస్తుందని పేర్కొంది.

కరోనా పరీక్షలు, రోగ నిర్ధరణ, చికిత్సపై దృష్టి సారించడం కష్టమైనందున ఈ సాధనాన్ని ఉపయోగిస్తున్నట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా టెస్టింగ్​ కేంద్రాలను పెంచినట్లు వివరించారు. ఈ చాట్​బోట్​.. కేసుల నివేదికలను ఆటోమేటిక్​గా అప్​డేట్​ చేస్తూ వేగవంతంగా వివరాలు సమకూరుస్తుందని చెప్పారు.

కరోనాపై పోరులో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుందని, ఐబీఎం చాట్​బోట్​తో కరోనా కేసులకు సంబంధించిన వివరాలు కచ్చితత్వంతో వేగవంతంగా నమోదవతాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్​, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి గోపాల క్రిష్ణన్ అన్నారు. ఈ చాట్​బోట్​ను ఐసీఎంఆర్​ అధికారిక వైబ్​సైట్​లో కొన్ని పేజీలకు అనుసంధానం చేసినట్లు, కరోనా నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అధికారులు మాత్రమే ఈ వర్చువల్​ చాట్​బోట్​ను వినియోగించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

Last Updated : May 4, 2020, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details