తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాత టీషర్టులతో మాస్కులు చేసుకోండిలా... - కరోనావైరస్ జాగ్రత్తలు

కరోనా కల్లోలంతో కాలు కూడా బయటకు పెట్టలేని పరిస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మాస్కులను కొనుక్కోలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే మాస్కులు తయారూ చేసుకోవడం ఎలాగో సూచిస్తూ ఓ కరదీపికను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ కార్యాలయం. పాత టీ-షర్ట్​లు, చేతి రుమాళ్లతో ఇంట్లో తయారు చేసుకునే మాస్కులే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో 70 శాతం ఎక్కువ సత్ఫలితాలనిస్తాయని నొక్కి చెబుతోంది.

COVID-19: Govt's scientific advisor issues manual for homemade masks, says they are 70% effective
పాతబట్టల మాస్కులే ఎంతో మేలు!

By

Published : Apr 1, 2020, 8:49 AM IST

Updated : Apr 1, 2020, 9:53 AM IST

మార్కెట్లో సర్జికల్​ మాస్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారా? దొరికినా, ఆకాశాన్నంటుతున్న ధరలు చూసి తలలు పట్టుకుంటున్నారా? అయితే ఇకపై, ఆ మాస్కుల గురించి చింతించనక్కర్లేదు అంటోంది ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం. మూలనపడ్డ పాత కర్చీఫ్​లు, టీషర్ట్​లు వెలికితీస్తే చాలంటోంది. ఇంట్లో తయారు చేసుకునే ముసుగులే మిగతా మాస్కుల కంటే 70 శాతం ఎక్కువ సత్ఫలితాన్నిస్తాయంటూ ఓ కరదీపికను విడుదల చేసింది.

ఖాదీ మాస్కేస్కో...

మాస్కులు ధరించడం వల్ల కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు గాల్లో కలిసే తుంపర్లు శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. జన సమూహాల్లో తిరిగే వ్యక్తులు కచ్చితంగా మాస్క్​ ధరించాలని సూచిస్తోందీ కరదీపిక. అయితే, పలుచటి సర్జికల్​ మాస్కులకంటే.. రెండు వరుసల ఖాదీ వస్త్రంతో తయారు చేసుకునే మాస్కులు 70 శాతం మెరుగ్గా పనిచేస్తాయని చెబుతోంది.

ఇలా వాడుకోవచ్చు..

మాస్కులు తయారు చేసుకునే ముందు, పాత వస్త్రాన్ని కనీసం 5 నిమిషాల పాటు ఉప్పువేసిన వేడినీళ్లలో మరిగించాలి. ముక్కు, నోరుకు అడ్డుగా కట్టుకునేలా వాటిని కత్తిరించి కుట్టుకోవాలి. ప్రతిరోజు ధరించిన మాస్కును సబ్బుతో ఉతికి, ఎండలో అతినీల లోహిత కిరణాల తాకేలా ఆరబెడితే ఎన్ని సార్లైనా వీటిని వాడుకోవచ్చు . కాబట్టి ప్రతి పౌరుడు, ఎన్​జీఓలు ఇలా స్వగృహ మాస్కులను తయారు చేసుకోవాలని పిలుపునిచ్చింది.

ప్రస్తుతం దేశంలో 50 శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. ఇలా అయితే మరో 50 శాతం మందికి వైరస్​ సోకే ప్రమాదముంది. కనీసం 80 శాతం జనాభా మాస్కు ధరిస్తే కచ్చితంగా వైరస్​ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం చెబుతోంది.

ఇదీ చదవండి:'లాక్​డౌన్​ ఉల్లంఘనల వల్లే కరోనా కేసుల వృద్ధి'

Last Updated : Apr 1, 2020, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details