లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవల వాహనాలకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
"కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టి పెట్టుకుని.. టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్లను రద్దు చేయాలని ఆదేశించాం. దేశమంతా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అత్యవసర సేవల వాహనాలకు ఇబ్బందులు తగ్గించటమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది."