తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 49 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో వరుసగా మూడో రోజు కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. కొత్తగా 83,809 మందికి వైరస్​ సోకింది. మరో 1,054 మంది కొవిడ్​కు బలయ్యారు.

Covid-19 fresh cases and deaths in the nation
తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 83,809 మందికి వైరస్​

By

Published : Sep 15, 2020, 9:32 AM IST

Updated : Sep 15, 2020, 10:44 AM IST

దేశంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఒక్కరోజులో వెలుగుచూస్తున్న కేసుల సంఖ్యలో వరుసగా మూడో రోజు తగ్గుదల కనిపించింది. తాజాగా 83,809 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,054 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49 లక్షల 30 వేలు దాటింది.

భారత్​లో 49 లక్షలు దాటిన కరోనా కేసులు

కొవిడ్​ బాధితులు పెరుగుతున్న స్థాయిలో మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 38.59 లక్షల మంది వైరస్​ను జయించడం వల్ల రికవరీ రేటు 78.28శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.64శాతం వద్ద ఉంది. ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వడమే ఇందుకు కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రాలవారిగా కరోనా కేసుల వివరాలు

దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షలు రోజూ సగటున 10 లక్షల 50వేలపైనే నిర్వహిస్తున్నారు. తాజాగా పరీక్షించిన 10 లక్షల 72వేల 845 నమూనాలతో కలిపి.. మొత్తం టెస్టుల సంఖ్య 5 కోట్ల 83 లక్షల 12 వేలు దాటింది.

ఇదీ చూడండి:బిహార్​ బరి: పక్కా వ్యూహంతో ఎన్డీఏ-లాలూ పార్టీకి సవాళ్లెన్నో..

Last Updated : Sep 15, 2020, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details