కరోనా సంక్షోభంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది.
వివిధ రాజకీయ పార్టీలు అందించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సలహాలను కూడా తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
తాము వెలువరిచే మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని.. స్థానికంగా కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించే బాధ్యత ముఖ్య ఎన్నికల అధికారులదేనని స్పష్టం చేసింది ఈసీ.
ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ తేదీల్లో బిహార్ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనితో పాటు కరోనా సంక్షోభం, వరదల వల్ల అనేక ఉపఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కొత్త షెడ్యూళ్లను విడుదల చేయలేదు ఈసీ.
ఇదీ చూడండి:-సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా