తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!

కరోనా మహమ్మారి భారత్​లో ఇంకా తీవ్ర రూపం దాల్చలేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జులై మొదట్లో వైరస్​ ఉగ్రరూపం ఉంటుందని, మొత్తం 18వేల మంది చనిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఆసియా దేశాల్లో మాత్రం మరణాల రేటు చాలా తక్కువగా ఉందని స్పష్టం చేశారు.

Covid-19 deaths could top
Covid-19 deaths could top 18,000 in India, says public health expert

By

Published : May 27, 2020, 6:18 PM IST

కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో కేసులు సంఖ్య క్రమక్రమంగా తగ్గింది. ప్రభుత్వాలు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తుండగా... సాధారణ జీవనం సాగించడం సిద్ధమవుతున్నారు ప్రజలు. మహమ్మారి ముప్పును దాదాపు అధిగమించారు. అయితే భారత్​లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వైరస్​ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే పలు లాక్​డౌన్​ అంక్షలను ఎత్తివేసింది కేంద్రం. ఆర్థిక కార్యకలాపాలు, రైలు, విమాన ప్రయాణాలు పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో భారత్​లో పరిస్థితిపై ఆందోళనకర విషయాలు చెబుతున్నారు నిపుణులు.

భారత్​లో జులై మొదట్లో కరోనా అత్యంత తీవ్ర రూపం దాల్చుతుందని, మరణాల సంఖ్య 18వేలకు చేరుతుందని అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు, సెంట్రల్​ ఫర్​ కంట్రోల్ ఆఫ్​ క్రోనిక్​ కండిషన్స్​(సీసీసీసీ) ప్రొఫెసర్​ డా.ప్రభాకరన్. ఇతర దేశాల్లో కరోనా మహమ్మారి ఏ విధంగా విజృంభించి, ఆ తర్వాత అదుపులోకి వచ్చిందనే అధ్యయనాలను పరిశీలించి అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

6 లక్షల కేసులు..

జులైలో భారత్​లో మొత్తం కేసుల సంఖ్య 4 నుంచి 6 లక్షలకు చేరుతుందని, 12నుంచి 18వేల మంది మరణించే అవకాశాలున్నాయని చెప్పారు అమెరికా ఎమోరీ యూనివర్సిటీ నిపుణులు. సగటు మరణాల రేటును పరిశీలించే ఈ గణాంకాలు అంచనా వేసినట్లు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్​లో మరణాల రేటు తక్కువగా ఉందని, వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.

ఆసియా దేశాల్లోనే తక్కువ..

ఆసియా దేశాల్లోనే కరోనా మరణాల రేటు శ్రీలంకలో చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు ఆరోగ్య నిపుణులు, ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్(హైదరాబాద్​) డైరెక్టర్​ ప్రొఫెసర్​ జీవీఎస్ మూర్తి. ఆ దేశంలో 10లక్షల మందిలో 0.4శాతమే మరణిస్తున్నారని తెలిపారు. భారత్​, సింగపూర్​, పాకిస్థాన్, బంగ్లాదేశ్​, మలేసియా దేశాల్లోనూ మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం చెప్పడం క్లిష్టమన్నారు.

ఆసియా దేశాల్లో లాక్​డౌన్ త్వరగా విధించారని... అందుకే అమెరికా, ఇటలీ దేశాల స్థాయిలో వైరస్​ వ్యాప్తి చెందలేదని వివరించారు మూర్తి. ప్రపంచం, భారత్​లో లభించిన ఆధారాల ప్రకారం 60ఏళ్లు పైబడిన వారే వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. భారత్​లో కరోనా సోకి మరణించిన వారిలో 50 శాతానికిపైగా వృద్ధులే ఉన్నారని చెప్పారు.

అమెరికాలో 22.4శాతం, బ్రిటన్​లో 24.12 శాతం, ఇటలీలో 29.4 శాతం వృద్ధులు ఉండగా భారత్​లో అది 9.9 శాతమే అన్నారు. లాక్​డౌన్ త్వరగా విధించడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలున్న అనేక మందికి వైరస్​ వ్యాప్తి చెందలేదని, అందుకే మరణాల రేటు తక్కువగా ఉందని వివరించారు.

వచ్చే 15 రోజుల్లో డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని మూర్తి హెచ్చరించారు. పరిశుభ్రత, స్వీయ రక్షణే వైరస్​ కట్టడికి ఆరోగ్య సూత్రాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details