దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దిల్లీలో నిజాముద్దీన్ జమాత్ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మంది వైరస్ బారిన పడినట్లు గుర్తించారు అధికారులు. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,764 యాక్టివ్ కేసులుండగా, 151 మంది కోలుకున్నారు. మరో 50 మంది మృత్యువాతపడ్డారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 13 మంది చనిపోగా.. గుజరాత్-6, మధ్యప్రదేశ్-6, పంజాబ్-4, కర్ణాటక-3, తెలంగాణ-3, బంగాల్-3, దిల్లీ, జమ్ముకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళలో రెండేసి మరణాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదవ్వగా.. 265 కేసులతో కేరళ రెండోస్థానం, 234 కేసులతో తమిళనాడు మూడోస్థానంలో ఉన్నాయి.
గుజరాత్లో 7కు చేరిన మృతులు
గుజరాత్ వడోదరాలో 52 ఏళ్ల వ్యక్తి ఇవాళ ఉదయం కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ఫలితంగా గుజరాత్ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 87 కేసులు నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో 8
మధ్యప్రదేశ్‌లోనూ కరోనాతో ఇవాళ 54 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 75 కేసులు నమోదయ్యాయి.
దిల్లీ ఎయిమ్స్ డాక్టర్‌కు కరోనా?