తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆత్మ నిర్బర్ భారత్..​ ఒంటరివాదానికి సూచన కాదు'

బహుపాక్షికత, అంతర్జాతీయ ఐక్యత ద్వారా మాత్రమే కరోనా సవాళ్లను విజయవంతంగా అధిగమించవచ్చని చెప్పారు నీతి ఆయోగ్​ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్​. ఆన్​లైన్​ ద్వాారా జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి రాజకీయ వేదికకు 2వ జాతీయ స్వచ్ఛంద సమీక్షను సమర్పించారు.

COVID-19 challenges can be addressed only through multilateralism, global solidarity: India at UN
''ఆత్మ నిర్బర్ భారత్'​ ఒంటరివాదానికి సూచన కాదు'

By

Published : Jul 14, 2020, 9:22 AM IST

Updated : Jul 14, 2020, 11:30 AM IST

కరోనా మహమ్మారి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలన్నారు నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​ కుమార్. బహుపాక్షికత, అంతర్జాతీయ ఐక్యత ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పారు. 'ఆత్మనిర్బర్​ భారత్'​ ద్వారా కొవిడ్​ సంక్షోభాన్ని అధిగమించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు ఒంటరివాదాన్ని సూచించవని వివరించారు రాజీవ్. బహు పాక్షిక, ప్రపంచ ఆర్థిక క్రమానికి భారత్​ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 2వ జాతీయ స్వచ్ఛంద సమీక్ష(వీఎన్​ఆర్​)ను ఐక్యరాజ్యసమితికి సమర్పించింది భారత్​. ఆన్​లైన్​ ద్వాారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్​ కుమార్​ పాల్గొన్నారు. ఉన్నతస్థాయి రాజకీయ వేదికగా వివరాలను సమర్పించారు. ప్రపంచ దేశాల ముందు కరోనా హమమ్మారి అనేక కొత్త సవాళ్లను ఉంచిందని నొక్కి చెప్పారు రాజీవ్.

" అన్ని సభ్య దేశాలు వాతావరణ మార్పు, పేదరికం, మానవ అక్రమ రవాణా, ప్రకృతి వైపరీత్యాలు సహా అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. బహుపాక్షికత, అంతర్జాతీయ ఐకమత్యం ద్వారా మాత్రమే వీటిని విజయవంతంగా పరిష్కరించవచ్చు."

-రాజీవ్ కుమార్​, నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​

కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులను అవకాశాలుగా మార్చుకొని ప్రపంచదేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని రాజీవ్​ సూచించారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు 276 బిలియన్​ డాలర్లలో భారత్​ ఉద్దీపన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇది భారత జీడీపీలో 10శాతమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చైనాతో పంథాను మార్చాల్సిందే..

Last Updated : Jul 14, 2020, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details