దేశంలో కరోనా తీవ్రత, తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు విషయాలు వెల్లడించింది. ఇప్పటికే వైరస్ తీవ్రత ఎక్కువున్న బంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆరు క్షేత్రస్థాయి బృందాలు పర్యటిస్తున్నాయి. అయితే రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించేందుకు మరో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం.
ఈ బృందాలను హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, సూరత్ల్లో వైరస్ ప్రభావాన్ని పరిశీలించేందుకు పంపించింది. అదనపు కార్యదర్శి స్థాయి అధికారుల నేతృత్వంలో ఈ బృందాలు పనిచేస్తాయి. నిపుణులతో కూడిన ఈ బృందాలు రాష్ట్రాల్లో పర్యటించి అవసరమైన మేరకు స్థానిక ప్రభుత్వాలకు సూచనలు చేస్తాయి.
5 లక్షలకు పైగా పరీక్షలు..
దేశంలో ఇప్పటివరకు 5,00,542 వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు సమాచారం. 9,45,000 మంది అనుమానితులను పరిశీలించినట్లు తెలుస్తోంది. కరోనాతో ప్రాణాలు కోల్పోయే రేటు దేశంలో 3.1 శాతమని అంచనా వేసింది కేంద్రం.
లాక్డౌన్ లేకపోతే..లక్ష కేసులు!